RIMC: TGPSC-RIMC ఎనిమిదో తరగతి ప్రవేశాలు 15 d ago
డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో జనవరి -2027 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీజీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతుంది. గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2027 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న వారు అలాగే ఏడో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, వైవా వాయిస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. పరీక్షా కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్ధులకు రూ. 600, SC/ST అభ్యర్ధులకు ఫీజు రాయితీ ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్లో దరఖాస్తులను ఏప్రిల్ 5వ తేదీ లోపు బషీర్ బాగ్ హైదరాబాద్ కార్యాలయానికి పంపించాలి. ఈ పరీక్షను జూన్ 7 వ తేదీన నిర్వహిస్తారు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.